KMM: నేలకొండపల్లి ఆటో స్టాండ్ వద్ద ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజా పాలనలో భాగంగా ఏఎస్సై లతీఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ఆటో డ్రైవర్లు, వాహనదారులతో రోడ్డు భద్రతపై ప్రమాణం చేయించారు. నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు బాధ్యత వహిస్తామని డ్రైవర్లు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కల్పించారు.