SDPT: హుస్నాబాద్ మండలం పొతారం గ్రామంలో సోమవారం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను హాజరై వాహనదారులకు నిబంధనల ప్రాముఖ్యత వివరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలనీ, మద్యం సేవించి డ్రైవింగ్ చేయొద్దని సూచించారు. లైసెన్స్, వాహన పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని చెప్పారు.