MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి ‘BA ఆనర్స్’ కోర్సు అందుబాటులోకి రానుందని ప్రిన్సిపల్ శంకర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సులో చేరడానికి అర్హులని పేర్కొన్నారు. వినూత్నమైన ఈ డిగ్రీ కోర్సు ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.