NLG: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రవాణా వ్యవస్థను మెరుగు పరిచే లక్ష్యంతో ప్రభుత్వం భారీ ప్రాజెక్టును చేపట్టింది. సుమారు రూ.700 కోట్ల వ్యయంతో 360 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 250 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం, మరమ్మతులు పూర్తయ్యాయి అని అధికారులు తెలిపారు.