KMM: ముదిగొండ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ వేడుకల్లో కలెక్టర్ అనుదీప్ శుక్రవారం పాల్గొన్నారు. చదవడం అనేది ప్రాథమిక నైపుణ్యమని, అది పట్టుబడితేనే రాయడం, మాట్లాడడం సులభమవుతుందని అన్నారు. జిల్లాలో పఠన నైపుణ్యాలు 13 నుంచి 84 శాతానికి పెరగడంపై హర్షం వ్యక్తం చేశారు. వంద శాతం లక్ష్యాన్ని సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.