BHPL: చిట్యాల మండలం జూకల్ గ్రామంలో శుక్రవారం సూపర్వైజర్ జయప్రద, అంగన్వాడి టీచర్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సర్పంచ్ సంధ్యారాణి మాట్లాడుతూ.. ప్రస్తుత వేసవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పిల్లలు, తల్లులు అనవసరంగా బయటకు వెళ్లవద్దని సూచించారు. కార్యక్రమంలో వార్డ్ మెంబర్ తిరుపతి, ANM సుస్మిత, సంధ్య తదితరులు ఉన్నారు.