SRCL: జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా చందుర్తి -మల్యాల రహదారికి ఇరువైపులా అడ్డుగా ఉన్న చెట్లను, పొదలను పోలీసులు బుధవారం తొలగించారు. ఎస్సై రమేశ్ ఆదేశాలతో సిబ్బంది ఈ పనులు చేపట్టారు. మలుపుల వద్ద చెట్లు అడ్డుగా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనదారుల భద్రత దృష్ట్యా రహదారిని శుభ్రం చేసినట్లు ఎస్సై తెలిపారు.