VKB: కుల్కచర్ల మండల కేంద్రంలో పీఏసీఎస్ ద్వారా అగ్రి డ్రోన్‌ను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులు అవలంబించి అగ్రిడ్రోన్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.