JN: చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామంలో ఇటీవల జరిగిన GP ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్‌గా గెలిచిన దివ్యాంగురాలు తిరుపతమ్మను ఇవాళ కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నపెండ్యాల గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో BJP రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వెంకటేశ్వర్లు ఉన్నారు.