GDWL: అయిజ మండలం చిన్నతాండ్ర పాడులో మంగళవారం అర్ధరాత్రి ప్రకృతి ప్రకోపించింది. భారీ ఈదురు గాలుల ధాటికి పలువురి నివాసాల పైకప్పు రేకులు ఎగిరిపోయి, ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురయ్యాయి. టీవీ, ఫ్రిడ్జ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతిన్నాయి. ఎవరికీ గాయాలు కాకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.