ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో ప్రగతి ప్రాణాళికలో భాగంగా శుక్రవారం వరల్డ్ హోమియోపతి డే నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ కె హరిత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కాసేపు యోగాసాధన చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత లభిస్తుందని తెలిపారు. మానవ జీవన విధానంలో హోమియోపతికి ముఖ్యపాత్ర ఉందని పేర్కొన్నారు.