KMR: పిట్లం మండల కేంద్రానికి చెందిన గంగామణికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 24 వేల చెక్కు మంజూరైంది. సోమవారం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ శేఖర్ లబ్ధిదారురాలికి ఈ చెక్కును అందజేశారు. పేద ప్రజల ఆరోగ్య అవసరాలకు ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు హన్మండ్లు, రాజు, నాయకులు నవీన్, ఇమ్రోజ్ ఉన్నారు.