NLG: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ కార్పొరేటర్ మామిడి కార్తిక్ పేర్కొన్నారు. ఈ రోజు డివిజన్లోని పలువురి లబ్ధిదారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు కొంత ఆర్థిక భరోసాని ఇస్తుందని తెలిపారు.