ADB: బోథ్ మండలంలోని పట్నాపూర్ గ్రామంలో నూతనంగా మంజూరు అయిన రూ. 2 కోట్ల 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఈరోజు ఎంపీ నగేష్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమిపూజ చేశారు. పనులు త్వరతరగతిన పూర్తి చేసి ప్రజలకు తొందరగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.