SRD: మనూర్ పోలీస్ స్టేషన్ ముందు సోమవారం అర్ధరాత్రి పోలీస్ వాహనం ఢీకొన్న సంఘటనలో ఏఎస్సై మృతి చెందారు. ఏఎస్సై గోవింద్ నాయక్ పై నుంచి వాహనం దూసుకెల్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. వాహనం డ్రైవర్ రామారావు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.