HYD: హైదరాబాద్ నుంచి ORR పరిధిలో వంద శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా చేపట్టిన పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం 39 మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం కొనసాగుతుండగా, వచ్చే ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టులతో కాలుష్యం తగ్గి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందనుంది.