భువనగిరి: బస్వాపూర్‌లో ప్రభుత్వం నిర్మించిన ఫంక్షన్ హాల్లో మౌలిక వసతులు కల్పించి, వెంటనే వాడుకలోకి తేవాలని సీపీఎం జిల్లా నాయకులు డి.నర్సింహ డిమాండ్ చేశారు. సోమవారం ‘పోరుబాట’ కార్యక్రమంలో భాగంగా సమస్యలను పరిశీలించిన ఆయన, పదేళ్లు గడుస్తున్నా భవనం నిరుపయోగంగా ఉండటం దారుణమన్నారు. పేదలకు ఉపయోగపడాల్సిన హాలును పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.