JN: జనగామ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. ‘రంగోత్సవ సెలబ్రేషన్స్’ నిర్వహించిన కలరింగ్, ఇంగ్లిష్ హ్యాండ్రైటింగ్ పోటీల్లో పాల్గొన్న ఏడుగురిలో ఐదుగురు విజేతలుగా నిలిచారు. గురువారం విజేతలకు మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్లు, ట్రోఫీలు అందినట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు.