WGL: సీనియర్ జర్నలిస్ట్, ఉద్యమ కళాకారుడు జీలుకర కృష్ణాకర్ కి ప్రతిష్టాత్మక ‘దళిత రత్న’ అవార్డు లభించింది. డా. బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాదులో ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డు అందజేశారు. అంబేద్కర్ ఆశయాలను సమాజంలో విస్తరించడంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.