KNR: రాష్ట్ర అడిషనల్ డీజీపీ చారు సిన్హా గురువారం కరీంనగర్ రేకుర్తిలోని భరోసా కేంద్రాన్ని తనిఖీ చేశారు. బాధితులకు తక్షణ న్యాయ సహాయం, కౌన్సిలింగ్ అందించాలని సూచించారు. కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా పక్కా ఆధారాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రంలో అన్ని సేవలు ఒకేచోట అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.