BHNG: ఆలేరు మండలం కొలనుపాకలో జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మహనీయుని సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు.