MDCL: నాచారం పరిధి రాఘవేంద్ర నగర్ సహా అనేక ప్రాంతాల్లో లో ప్రెషర్ నీటి సరఫరా సమస్య తీవ్రంగా మారింది. చాలా కాలనీలలో నీరు సరైన ప్రెషర్‌తో రాకపోవడంతోపై అంతస్తుల్లో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. వారానికి కొన్ని రోజులు మాత్రమే నీరు అందుతుండటంతో దైనందిన అవసరాలు కూడా కష్టంగా మారాయి. అధికారులు వెంటనే స్పందించి సరఫరా మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు.