HNK: కాజీపేట పట్టణంలో గంజాయి, గంజాయి చాక్లెట్లతో రైలులో వచ్చిన ఏడుగురిని బుధవారం అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. కాశీ నుంచి వచ్చిన నిందితులు రైల్వే స్టేషన్ వద్ద దిగిన సమయంలో పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 30గ్రాముల గంజాయి, 830గ్రాముల గంజాయి చాక్లెట్లు, 6సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు.