BDK: అభివృద్ధి, సంక్షేమంతో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో సంస్థాగతంగా పటిష్టంగా నిర్మాణం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అఫైర్స్ కమిటీలో నేతలు అన్నారు. కొత్తగూడెంలో గురువారం డీసీసీ అధ్యక్షురాలు దేవి ప్రసన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, తెల్లం వెంకటరావు పాల్గొన్నారు.