NZB: న్యాయవాదిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని లాయర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం NZB బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కోర్టు ఎదుట ధర్నా చేశారు. న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. మహిళ న్యాయవాది కళ్యాణిపై ఆదివారం రుద్రూర్లో గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.