NGKL: లింగాల మండల కేంద్రంలో గల రైతు వేదికలో జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా ప్రకృతి వ్యవసాయంపై మండల వ్యవసాయ అధికారి అనిల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అప్పాయిపల్లి, శాయిన్ పేట గ్రామాలకు చెందిన రైతులకు ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు ప్రత్యేకంగా రూపొందించిన కిట్లను పంపిణీ చేశారు.