KNR: పట్టణాల రూపురేఖలు మార్చేందుకు కేంద్రం ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’కు శ్రీకారం చుట్టింది. బుధవారం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాష్ట్రాల మున్సిపల్ శాఖలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మార్గదర్శకాలు విడుదల చేశారు. మున్సిపాలిటీలు కేవలం గ్రాంట్లపై ఆధారపడకుండా, ఆదాయాన్ని సృష్టించే ప్రాజెక్టుల ద్వారా మార్కెట్ నిధుల సమీకరణ చేపట్టాలని సూచించారు.