SRD: మనవాదుల దాడి నుంచి రాజ్యాంగ హక్కులను కాపాడుకుందామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అబ్బాస్ సూచించారు. సంగారెడ్డిలోని కేకే భవన్లో మోదీ పాలన- రాజ్యాంగం- సామాజిక న్యాయంపై దాడి అంశంపై సెమినార్ శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రసాదించిన సామాజిక న్యాయం ధ్వంసం అయిందని విమర్శించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మోదీ పాలన కొనసాగుతోందని తెలిపారు.