VSP: పెద్ద వాల్తేరు ప్రభుత్వ చెస్ట్ ఆస్పత్రిలో రూ.1.5 కోట్ల విలువైన ‘ఈబస్’ (EBUS) సిస్టమ్‌ను మంత్రి సత్య కుమార్ ప్రారంభించారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇన్ఫెక్షన్ల గుర్తింపునకు ఇది ఎంతో కీలకం అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి అధునాతన సదుపాయం రావడం ఇదే తొలిసారి అని సూపరింటెండెంట్ సునీల్ కుమార్ తెలిపారు.