VKB: బషీరాబాద్ మండలం నవాండ్ది రైల్వే స్టేషన్లో వీధి కుక్కల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాట్ ఫామ్- 2లో వీధి కుక్కలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు కుక్కల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.