SRD: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పటాన్ చెరు మార్కెట్ కమిటీ ఛైర్మన్గా శివానందం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం సభ్యులు రైతుల కోసం పనిచేయాలని చెప్పారు. కార్యక్రమంలో టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మల రెడ్డి పాల్గొన్నారు.