MDK: మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామంలోని భవాని జువెలర్స్‌లో భారీ చోరీ యత్నం విఫలమైంది. షాపు షట్టర్లు పగులగొడుతున్న శబ్దం విన్న యజమాని సురేందర్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. దొంగలు ఇనుప రాడ్‌తో దాడి చేసినప్పటికీ, సురేందర్ ధైర్యంగా ఎదుర్కొని ఒక దొంగను పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. యజమాని చూపిన సాహసాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.