నల్లగొండ జిల్లాలో “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత వారోత్సవాలు ఏప్రిల్ 13 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు, డ్రైవర్ల తనిఖీలు, విద్యార్థులకు రోడ్డు భద్రతపై శిక్షణ చేపడతారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ పిలుపునిచ్చారు.