GDWL: శాంతినగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమావాస్య సందర్భంగా ఇవాళ గాయత్రి గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గో ప్రచారక్ సేవా సమితి ఆధ్వర్యంలో అర్చకులు వినయ్ శర్మ అష్టోత్తర పూజలు గావించారు. అనంతరం గోమాతకు గ్రాసం తినిపించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తురాలు కృష్ణవేణి సమర్పించిన వస్త్రాలతో గోమాతను అలంకరించి ప్రసాద వితరణ చేశారు.