PDPL: అంతర్గాం మండలం మూర్ముర్లో నిర్మించిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈనెల 27న విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ తెలిపారు. మార్చి 1, 2 తేదీలలో స్వామివారి కళ్యాణ మహోత్సవం, అనంతరం జాతర కొనసాగుతుందని పేర్కొన్నారు. గత 66 ఏళ్లుగా గోపు వంశీయులు కొమురన్న పేరుతో ఈ జాతరను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.