KNR: గంగాధర మండలం గర్శకుర్తి గ్రామ చెరువులో మట్టి తవ్వకాలను గ్రామస్థులు సోమవారం రాత్రి అడ్డుకున్నారు. చెరువులోని మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని ఆరోపించారు. చెరువులో మట్టిని తొలగిస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులోకి వచ్చిన జేసీబీలు, లారీలను గ్రామస్థులు అడ్డుకుని వెనక్కి పంపించారు.