ADB: రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని ఆదిలాబాద్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించే అంశాలపై చర్చించారు. జిల్లా అభివృద్ధి, భద్రతకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యే అభినందించారు.