AP: మంత్రి సత్యకుమార్ ఇవాళ ధర్మవరం, బత్తలపల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఉదయం అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, అనంతరం మార్కెట్ యార్డ్లో విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం బత్తలపల్లిలో ఎస్సీ లబ్ధిదారులకు సోలార్ ప్యానెళ్లను అందజేస్తారు. తర్వాత సాయంత్రం పోతుకుంట ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని సందర్శించనున్నారు.