GDWL: జిల్లా కేంద్ర సమీపంలోని జమ్మి చెట్టు జమ్మలమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణా నది జలాలతో అమ్మవారికి అభిషేకం, ఆకుపూజ, హోమంతో పాటు మొత్తం 15 రకాల శాస్త్రోక్త కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారు. మంగళవారం కావడంతో జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.