VKB: బొంరాస్ పేట మండలంలో సోమవారం అర్ధరాత్రి ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించినా, భీకర శబ్దాలకు జనం ఉలిక్కిపడ్డారు. గాలివానకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా, పలుచోట్ల మామిడికాయలు నేలరాలాయి. కోత దశకు వచ్చిన వరి పంట దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.