రంగారెడ్డి జిల్లా ఆమనగల్ సమీపంలో మీర్ఖాన్పేట్ వద్ద ORR నుంచి RRR వరకు నిర్మించనున్న రేడియల్ రోడ్ల కోసం భూముల స్వాధీనం అంశం వివాదంగా మారింది. భూమి యజమానులు పరిహారం చెల్లిస్తేనే భూమిని ఖాళీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపి, అర్హులైన భూస్వాములకు తగిన పరిహారం అందించాలని ఆదేశించింది.