KMM: సురక్షిత మాతృత్వంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ అనుదీప్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో సురక్షిత మాతృత్వ దినోత్సవంలో కలెక్టర్ మాట్లాడారు. గర్భిణులకు సకాలంలో వైద్య పరీక్షలు అందించి, హైరిస్కు కేసులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ఈ ఏడాది చివరినాటికి జిల్లాలో మాతృ, శిశు మరణాలను సున్నా స్థాయికి తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.