BDK: కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు పాల్గొని నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలు యువతకు స్ఫూర్తిగా నిలవాలని కలెక్టర్ అన్నారు. రాజ్యాంగం సమానత్వానికి పునాది అని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించి అవగాహన కల్పించారు.