MNCL: టీపీసీసీ అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నట్లు చెన్నూరు సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ బొడ్డు రాకేష్ తెలిపారు. నూతన డీసీసీ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరవుతారన్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాల ప్రచారం, రాబోయే జెడ్పీ ఎన్నికల సన్నద్ధతపై ఈ పర్యటనలో ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో కార్యకర్తలు, నేతలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.