KMR: రాజంపేట్ మండలం పెద్దాయిపల్లిలో ఇవాళ బసవేశ్వర స్వామి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడి ఎల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. బసవేశ్వర స్వామి బోధనలు సమాజానికి మార్గదర్శకమని అన్నారు.