KMM: ముదిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్పీవీ టీకా కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటివరకు 122 మంది బాలికలకు టీకాలు విజయవంతంగా ఇచ్చారు. 14 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల బాలికలకు ఈ టీకా అందిస్తున్నారు. టీకా కోసం వచ్చే వారు బాలిక ఆధార్ కార్డు, కుటుంబ సభ్యులతో కలిసి రావాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు నాగేంద్ర ప్రసాద్, పాల్గొన్నారు.