JGL: తక్కళ్ళపల్లి గ్రామంలో బుధవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు ఆయా వాడల్లో తిరిగి విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. బుధవారం ఒకే రోజు కొత్తగా 40 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.