NRML: ఎండల తీవ్రత నేపథ్యంలో ఉ.10 గంటల లోపు ఉపాధి హామీ పనులు ముగించుకొని కూలీలు తమ ఇళ్లకు చేరుకోవాలని డీఆర్డీవో పీడీ విజయలక్ష్మి సూచించారు. గురువారం కడెం మండలంలోని నర్సాపూర్, లింగాపూర్ గ్రామాల శివారులో కొనసాగుతున్న ఉపాధి హామీ పని ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. కూలీలు ఎండల తీవ్రత నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.