SRPT: అనంతగిరి మండలం లకారంలో ‘బడిబాట’ కార్యక్రమం నిర్వహించారు. కాంప్లెక్స్ హెచ్ఎం పురుషోత్తం మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం, ఉచిత విద్యను ప్రభుత్వం అందిస్తోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఉపాధ్యాయులు పాల్గొని ఇంటింటికీ వెళ్లి విద్యావశ్యకతపై అవగాహన కల్పించారు.