WNP: ఏపీఎస్ఈబీ సర్వీసు నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతోంది. గురువారం రెండో రోజు వనపర్తి డివిజన్ కార్యాలయం ముందు కార్మికులు భారీగా నిరసన తెలిపారు. విధులను బహిష్కరించి న్యాయమైన డిమాండ్లు తీర్చాలని నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కారం వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.